తాను ఎంతగానో ప్రేమించే గర్ల్ ఫ్రెండ్ తన కంటికి నచ్చేలా ఉండాలని.. చూడగానే ముద్దొచ్చేలా ఉండాలని కోరుకుంటారు బోయ్ ఫ్రెండ్స్. ఆమె కొంచెం లావెక్కినా…కొంచెం సన్నబడ్డా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఆహార నియమాలు పెడుతుంటారు.
చెక్కర కన్నా బెల్లం ఎంతో బెటర్
చైనాలోని ఝుమాదియన్ నగరంలో ఝాంగ్ అనే బోయ్ ఫ్రెండ్ కూడా అదే చేశాడు. ఝాంగ్ తన గర్ల్ ఫ్రెండ్ వాంగూ ఇద్దరు కలిసి ఫెంగ్వాంగ్ రోడ్డులో షాపింగ్ కెళ్లారు. అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ను చూసే సరికి ఆమె మనసు ఆగలేదు. ఐస్ క్రీమ్ తినాలపించింది. ఐస్ క్రీమ్ ఇప్పించాలని బోయ్ ఫ్రెండ్ ను అడిగింది. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ అధిక బరువుతో అసహ్యంగా కనిపిస్తుందని బాధపడుతున్న ఝాంగ్ ఐస్ క్రీమ్ ఇప్పించడానికి నిరాకరించాడు. ఐస్ క్రీమ్ తింటే మరింత లావెక్కుతావని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అతని మాటలు వినిపించుకోకపోగా…ఐస్ క్రీమ్ ఇప్పించలేదనే క్షణికావేశంలో పక్కనే ఉన్న ఓ దుకాణంలో నుంచి కత్తెర తీసుకొచ్చి తన బోయ్ ఫ్రెండ్ ను కసిదీరా పొడిచింది. తీవ్రగాయాలైన ఝాంగ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
ఒకప్పుడు మహిళలు బాగానే ఉండేవారు, ఫోన్లు వచ్చాకే..