టీఎస్ పాలిసెట్ ఫలితాలు వచ్చేసాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్లో నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇందులో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు.
ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు ఉన్నారు.
పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలలో సీట్లతోపాటు అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.