బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే విద్య, ఉపాధి పేరుతో ఓట్లు అడగాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన…. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని రాష్ట్ర ప్రజలు భావిస్తే తమ పార్టీకి ఒక్క సారి అధికారం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.
ఢిల్లీలో విద్యావ్యస్థలో సానుకూల మార్పులు తీసుకు రావడం ద్వారా 1100 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కు భద్రత కల్పించామని ఆయన అన్నారు.
Advertisements
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8.5 లక్షల మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే, ఆప్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.