అసిఫా కుటుంబానికి భద్రత .. సుప్రీంకోర్టు

కథువా చిన్నారి అసిఫా కుటుంబానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు..జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఫ్యామిలీకే కాక, ఆ కుటుంబం తరఫున కేసు వాదిస్తున్న లాయర్లకు కూడా సెక్యూరిటీ కల్పించాలని కోర్టు సూచించింది.

కథువాలో కేసు విచారణ సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, అందువల్ల దీన్ని చండీగడ్ కోర్టుకు బదిలీ చేయాలని కథువా తండ్రి కోర్టును అభ్యర్థించారు. తమకు ఇక్కడ భద్రత లేదని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. జమ్మూలో పరిస్థితి చూస్తుంటే విచారణ, సక్రమంగా, శాంతియుతంగా జరుగుతుందని తాము భావించడం లేదని ఈ కుటుంబం తరఫు న్యాయవాది ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా-కతువాలో ఈ కేసు విచారణను ఈ నెల 28 కి వాయిదా వేశారు. అటు- ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా పోలీసులు తమ చార్జిషీట్ లో పేర్కొన్నారు. వీరిలో ఓ మాజీ రెవెన్యూ అధికారి, ఇద్దరు పోలీసు అధికారులు, ఓ మైనర్ కూడా ఉన్నారు.