కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ స్పీడప్ చేశాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం కరోనా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కొంతమంది నర్సులను, ఆరోగ్య కార్యకర్తలను ట్రైన్ చేసి… వ్యాక్సినేషన్ లేట్ అవ్వకుండా చూస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోసు తప్పనిసరి అని సూచిస్తున్నారు.
అయితే, ఉత్తరప్రదేశ్ లో ఓ నర్సు చేసిన పిచ్చి పని ఇప్పుడు తీవ్ర విమర్శకలు దారితీసింది. ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ మండోలీ ప్రాథమిక వైద్య కేంద్రంలో ఓ నర్సు.. ఫోన్లో మాట్లాడుతూ మహిళకు ఒకేసారి రెండు కరోనా టీకా డోసులు ఇచ్చింది. ఈ ఘటనపై సీనియర్ వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఏప్రిల్ 2 న ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్కు చెందిన కమలేశ్ దేవి… కరోనా టీకా తీసుకునేందుకు మండోలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. తనకు మొదటి డోసు ఇచ్చాక .. నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండో డోసునూ ఇచ్చారని ఆమె తెలిపారు. అలా ఎందుకు చేశావంటే తనతో గొడవకు దిగిందని ఆమె వివరించారు. అయితే, ఆ మహిళ పరిస్థితి నిలకడగానే ఉంది.