సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఫహద్ అహ్మద్‌తో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ వివాహంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె వివాహంపై అయోధ్య మహంత్ రాజు దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరా భాస్కర్ సాధికారత కలిగిన మహిళ అయితే మొదట పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు.
ఒక వేళ ఆమె 1,000 మంది పురుషులతో రాత్రులు గడపాలని కోరుకుంటే ఆమెకు అభినందనలని ఆయన తెలిపారు. ఎందుకంటే ఆమె అన్నా చెల్లెళ్లు వివాహం చేసుకుని, తలాక్, తలాక్, తలాక్ చెప్పుకునే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందంటూ కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశారు.
స్వరా భాస్కర్ బహిరంగంగా ఇన్షా అల్లాహ్, భారత్ తేరే తుక్డే హోంగే అంటూ నినాదాలు చేశారని పేర్కొన్నారు. పది రోజుల క్రితం ఫహాద్ ను స్వరా భాస్కర్ భాయ్ అని సంభోదించిందన్నారు. ఇప్పుడు మళ్లీ అతన్నే వివాహం చేసుకుందని ఆయన మండిపడ్డారు.
మరోవైపు నిన్న విశ్వ హిందూ పరిషత్ నేత సాద్వీ ప్రాచీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటారని ఆమె తెలిపారు. అందువల్ల ఆమె వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటుందని తాను ముందే ఊహించానన్నారు. ఆమె వివాహం చేసుకునే ముందు ఫ్రిజ్ వైపు చూసి ఉండాల్సిందన్నారు. త్వరలోనే ఆమె విడాకులు తీసుకుంటుందని లేదా ఆమెకు శ్రద్దా వాకర్ పరిస్థితి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.