ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్ షిప్‌లో గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు శామ్ అద్భతమైన రికార్డును నెలకొల్పాడు. నార్త్ ఈస్ట్ లీసెస్టర్ షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ లో అత్యధికంగా 410 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. సిక్సర్ తో 400 పరుగుల మైలురాయిని శ్యామ్ చేరుకోవడం విశేషం.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన 11వ వ్యక్తిగా శ్యామ్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది తొమ్మిదవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో శ్యామ్ చెలరేగి ఆడటంతో ఐదు వికెట్లు కోల్పోయి గ్లామోర్గాన్ జట్టు 795 పరుగులు చేసింది.
21వ శతాబ్ధంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ గడ్డపై ఇది మూడో అత్యధిక వ్యక్తి స్కోరు కావడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వార్విక్ షైర్ తరఫున 1994లో డర్హమ్ లో విండీస్ ఆటగాడు బ్రియన్ లారా అత్యధికంగా 501 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ ఫాన్స్ ఫోర్డు రెండు సార్ల క్వాడ్రపుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్‌తో జరిగిన అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనూ లారా అత్యధిక పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో అజేయంగా 400 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.