ఆ అందానికి..కెమెరాలే ఫిదా !
అతిలోక సుందరి .. అందాల శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్ ఫ్యాన్స్ ను ఫిదా చేయటంలో తల్లిని మించిపోయింది. అసలు జాను ఇంటి నుంచి కాలు బయట పెడుతుందంటే చాలు..కెమెరాలు క్లిక్ మనిపించటానికి పాపరాజీలు తహతహలాడిపోతుంటారు.
తాజాగా ముంబైలోని తన నివాసం మిజు నుంచి తన కజిన్ తో కలిసి ఇదిగో ఇలా బయటకొచ్చి తళుక్కున మెరిసింది జాహ్నవి. అంతే.. ఆమె అందానికి కెమెరాలు సైతం అవాక్కయ్యాయి..అంతేనా ఫ్లాష్ లైట్లతో తమ ప్రశంసలను వెల్లువలా కురిపించాయి.
సినిమాల్లో తక్కువగానే కనిపించినా.. లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో కావటంలో మాత్రం జాహ్నవి కపూర్ తక్కువేం తినలేదు. అందుకే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్.
దేశంలోని టాప్ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ కాస్ట్యూమ్స్ తో ఇలా కనువిందు చేయటంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది ఈ జూనియర్ శ్రీదేవి.