తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. దీంతో కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గ్లాండ్ ఫార్మా పెట్టుబడి కారణంగా జీనోమ్ వ్యాలీలో మరో 500 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా బయోలాజికల్స్ ఉత్పత్తి మరింతగా పెరుగనున్నది. సోమవారం మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం గ్లాండ్ ఫార్మా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
‘జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నదని ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడితో బయాలజికల్స్ లాంటి అడ్వాన్స్ ఏరియాల్లో 500 ఉద్యోగాల సృష్టి జరుగనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్, జీనోమ్ వ్యాలీల శక్తి నిత్యం బలోపేతమవుతోందని’ పేర్కొన్నారు కేటీఆర్.
Delighted to announce that @glandpharma is expanding their footprint in Genome Valley by investing ₹ 400 crores and creating 500 more jobs for advance areas such as biologicals
Strength of @TS_LifeSciences and Genome Valley is only growing everyday!#TelanganaleadsLifeSciences pic.twitter.com/54EFLphQcO
— KTR (@KTRBRS) February 20, 2023