నివారణే తప్పా చికిత్స లేని కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై దృష్టిపెట్టగా, మరికొన్ని కంపెనీలు వైరస్ సోకిన తర్వాత చికిత్సకు ఉపయోగించే మందులపై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఇండియా నుండే కరోనా మందును ఉత్పత్తి చేసేందుకు కీలక దశకు చేరుకుంది ప్రముక కంపెనీ.
ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లేన్ మార్క్ కరోనా చికిత్సలో కీలక దశకు చేరుకుంది. భారత ఔషద నియంత్రణ సంస్థల నుండి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కూడా ఏప్రిల్ చివరి వారంలోనే అనుమతి రావటంతో ఆ సంస్థ పరిశోధనలను వేగవంతం చేసింది. ఫెవిపెరావిర్ అనే మందుతో కరోనా వైరస్ చికిత్సపై చివరి దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది.
ఈ పరిశోధనలు ఇప్పటికే మొదలు కాగా పదికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎన్ రోల్ కూడా చేసుకున్నాయి. కంపెనీ అంచనా ప్రకారం జులై లేదా ఆగస్టు వరకు క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని ప్రకటించింది. ఈ మందు ఇన్ఫ్లూయెంజ వైరస్ ను విచ్ఛిన్నం చేస్తూ నోవల్ కరోనా వైరస్ పై పోరాడుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఫాబిఫ్లూ పేరుతో మార్కెట్ లో లభించనుంది. దీంతో ఈ మందు పనితీరుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కంపెనీ ప్రకటించింది.
అయితే… క్లినికల్ ట్రయల్స్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఫాబిఫ్లూ ఇచ్చిన వారిలో సింప్టమ్స్ గమనిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిపై కనీసం రోజుల నుండి 28 రోజుల వరకు స్టడీ చేస్తున్నామని, వీలైనంత త్వరగా డ్రగ్ తెచ్చే పనిలో ఉన్నట్లు ప్రకటించింది.