సాధారణంగా ట్యాక్సీ రోడ్డు మీద నడుస్తుంది. కానీ దుబాయ్ లో అయితే గాల్లో ఎగురుతుంది. ఏంటి షాక్ అవుతున్నారా? ఇది నిజం. ఎడారి దేశం ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఫ్లయింగ్ ట్యాక్సీలను తీసుకొచ్చింది. ట్రాఫిక్ తక్కువగా ఉంటే రోడ్డుపైనే సాఫీగా సాగిపోవచ్చు. ఉన్నట్టుండి ట్రాఫిక్ జామ్ ఏర్పడితే.. అప్పుడు కూడా ఆగాల్సిన పనిలేదు. హెలికాప్టర్ మాదిరి టేకాఫ్ తీసుకుని గాలిలో ప్రయాణించొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు సామాన్యుల్లో కూడా ఆసక్తిని కలిగిస్తోంది.
సోమవారం దుబాయ్ లో దీన్ని విజయవంతంగా పరీక్షించి చూశారు. దీనికి ఎక్స్ పెంగ్ ఎక్స్2 అనే పేరు కూడా పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్లయింగ్ కార్స్ ప్రాజెక్టుల్లో ఇదొకటి. డ్రైవర్ లేకుండానే గాల్లో ఎగిరే ఖాళీ కాక్ పిట్ తో సోమవారం పరీక్షలు చేశారు. దీంతో ఇది సక్సెస్ అయింది. అలాగే 2021 జులైలో డ్రైవర్ సహిత ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని పరీక్షించినట్టు ఎక్స్ పెంగ్ సంస్థ వెల్లడించింది.
అయితే ఇది విజయవంతంగా పరీక్షించినప్పటికీ, కానీ వెంటనే అందుబాటులోకి రావడం కష్టం.ఇంకా చాలా రకాలుగా పరీక్షల తర్వాతే ఇది సాధ్యపడుతుంది. అందుకు కొన్ని సంత్సరాల సమయం కూడా తీసుకోవచ్చని ఎక్స్ పెంగ్ సంస్థ తెలిపింది
ఎక్స్ పెంగ్ రూపొందించిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలో ఇద్దరు ప్రయాణికులు పడతారు. 8 ప్రొపెల్లర్స్ ఈ ట్యాక్సీలో ఉంటాయి. గంటకు 130కి.మీల దూరం ఇది ప్రయాణించగలదు అని సంస్థ పేర్కొంది. మనుషులు లేకుండా సోమవారం పరీక్ష నిర్వహించామని, మనిషితో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ నడిపే పరీక్షను తాము 2021 జూలైలోనే పూర్తి చేసినట్టు ఎక్స్ పెంగ్ తెలిపింది.