యూఎన్ జనాభా నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. కొవిడ్-19 పాండెమిక్ ప్రభావం వలన ప్రపంచ వ్యాప్తంగా మానవుల ఆయుర్ధాయం తగ్గిపోయినట్టు నివేదిక పేర్కొంది.
గ్లోబల్ గా మానవుని ఆయుర్ధాయం సగటున 2019లో 72.8 ఏండ్లుగా ఉంది. 2021లో మానవుని ఆయుర్ధాయం 71 ఏండ్లకు పడిపోయినట్టు నివేదిక వెల్లడించింది.
కానీ గత దశాబ్దంతో పోలిస్తే ఆయుర్దాయం ప్రస్తుతం పెరిగినట్టు నివేదిక పేర్కొంది. 1990 నుంచి చూస్తే మానవుని ఆయుర్ధాయం 9 ఏండ్లు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.
ఇటీవల మరణాల సంఖ్య తగ్గుతోందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2050లో ప్రపంచవ్యాప్తంగా మానవుని సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాల ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
స్త్రీ, పురుషుల ఆయుర్దాయం వరుసగా 73.8, 68.4గా ఉన్నట్టు నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం 5.4 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో(7) సంవత్సరా లనుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్(2.9)వరకు అన్ని దేశాల్లోనూ పురుషులతో పోలిస్తే స్త్రీల ఆయుర్ధాయం ఎక్కువ ఉన్నట్టు నివేదిక వివరించింది.