నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం…ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్ గ్లోబల్ లిస్ట్‌లో 128వ స్థానానికి చేరుకుంది. టర్కీ నగరమైన ఇజ్మీర్ అత్యధిక వృద్ధి రేటు 34.8%తో మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ 33.5%తో రెండో స్థానంలో ఉంది.
మొత్తం 150 నగరాల్లోని నివాస గృహాల ధరలు చూసుకుంటే సగటున సంవత్సరానికి 10.6% పెరిగాయని ఈ సర్వే పేర్కొంది. హైదరాబాద్ లో గృహాల ధరలు చూసుకుంటే సంవత్సరానికి 2.5% పెరుగుదలతో ఉన్నాయి.
అలాగే చెన్నై 2.2% పెరుగుదలతో ప్రపంచంలో 131వ స్థానంలో ఉంది. కోల్‌కతా 135వ, అహ్మదాబాద్ 139వ స్థానంలో ఉన్నాయి.