‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాతో చెర్రీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ఎక్కువగా కాస్ట్యూమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెర్రీ ధరించే వాచ్, షర్ట్స్, షూస్, గ్లాసెస్ ధరల విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.
అంతే కాదు చరణ్ ఓ ఫ్యాషన్ ఐకాన్ కూడా.. ఆఫ్ స్క్రీన్ కూడా తన ఫ్యాషనబుల్ అప్పియరెన్స్ తో వావ్ అనిపిస్తాడు. తాజాగా మరొకసారి రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్ తో వార్తల్లో నిలిచాడు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య ఉపాసన, పెట్ డాగ్ రైమ్ తో చాలా క్లాసీ లుక్ లో కనిపించాడు చరణ్.
అయితే ఆ సమయంలో చెర్రీ పెట్టుకున్న డియోర్ గ్లాసెస్ పై చాలామంది ఫోకస్ పడింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో లగ్జరీ కళ్లజోడుగా బాగా ఫేమస్ అయిన ఈ డియోర్ స్పెట్స్ ధర.. అక్షరాలా రూ.44,000. డియోర్ అనేది ఒక ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్.. సెలబ్రిటీలు ఎక్కువగా డియోర్ కళ్లద్దాలు ధరించి కనిపిస్తారు.
లేటెస్ట్ గా ఎయిర్ పోర్ట్ లో చెర్రీ లుక్ చూసి అతని లేడీ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చెర్రీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత జెర్సీ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్.