రేవంత్ రెడ్డి
మల్కాజ్ గిరి ఎంపీ
ఏపీ జీవో 203 తో కృష్ణనుండి నీటిని తరలించేందుకు తెచ్చినా కేసీఆర్ కు పట్టడంలేదు. 12 ఆగస్టు వైసిపి ఎమ్మెల్యే రోజా ఇంటిలో రాగిసంకటి , నాటుకోడి పులుసు తిని సీమకు నీళ్లిస్తా అని కేసీఆర్ చెప్పింది నిజం కాదా ? మే 5 న జగన్ తెస్తే ..కేసీఆర్ మే 11 న సమీక్ష చేశారు.జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేసిన తర్వాత కేసీఆర్ మేల్కొని సమీక్షా చేశారు. కేసీఆర్ అనుమతితోనే జగన్ జీవో 203 తెచ్చారు, కేసీఆర్ కేటీఆర్ ,హరీష్ లు ఈ జీవో గురించి అందుకే మాట్లాడటం లేదు. పోతిరెడ్డి పాడు ద్వారా .. నీళ్లు కేంద్రం పర్యవేక్షణలో ఉండాలి. ఏపీ ఇష్టం వచ్చినప్పుడు గేట్ తెరుచుకుని నీళ్ళు దోచుకుంటుంది.కేసీఆర్ ,జగన్ ఇంటిసమస్య కాదు .. తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య పోతిరెడ్డి పాడు.
పోతిరెడ్డి పాడు జల దోపిడీపై పీఎం మోడీ , జలవనరుల శాఖా మంత్రి కి లేఖలు రాస్తాం, నాడు పోతిరెడ్డి పై పీజేఆర్ , మర్రి అలుపెరగని పోరాటం చేశారు. పోతిరెడ్డి నీళ్ళ దోపిడీ ని కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుంది. నాడు పోతిరెడ్డి పాడు నుండి నీళ్లు దోపిడీ చేసినప్పుడు టీఆరెస్ మంత్రులు కేబినెట్లో ఉండి ఏం చేశారు ..?
ప్రస్తుతం 55వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడునుండి నీళ్ళు వెళుతుంటే కేసీఆర్ ఆరేళ్లుగా ఏం చేస్తున్నారు ? పోతిరెడ్డి కాంట్రాక్టు పనులు కేసీఆర్ చెప్పిన వారికే వస్తాయి. పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు జగన్ కు .. కేసీఆర్ గిఫ్ట్ గా ఇచ్చారు.