విరాట్ కోహ్లీ ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణకు పుడుతుంది. క్రికెట్ లో ఎన్నో రికార్డులను ఆయన బద్దలు కొట్టాడు. కానీ ఇటీవల పేలవమైన ఆట తీరుతో కోహ్లీ విమర్శల పాలవుతున్నారు.
గత రెండు మూడేండ్లలో చెప్పుకునేంత అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన మ్యాచ్ లు తక్కువే. ఇటీవల ఐపీఎల్ లోనూ ఆశించిన స్థాయిలో ఆట తీరు కనబర్చలేకపోయారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. కోహ్లీకి కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో కుటుంబంతో అతను తగినంత సమయం గడపాల్సిన అవసరం ఉందన్నాడు.
ఐపీఎల్ తర్వాత కోహ్లీకి కొంత విశ్రాంతి దొరికింది. అయినప్పటికీ మరింత విశ్రాంతి కావాలన్నట్టు విరాట్ కనిపిస్తున్నాడని చెప్పాడు. మూడు నెలల విశ్రాంతి అతడికి అవసరం అనిపిస్తోంది. అందుకే కోహ్లీ వెళ్లి బెంచ్ మీద కూర్చోవడం నయమని వ్యాఖ్యానించాడు.