హిట్ 2 సినిమాతో మంచి హిట్ కొట్టింది మీనాక్షి చౌదరి. ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పుడు మీనాక్షి… నాగ చైతన్యతో ఒక సినిమాలో నటించే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తాను ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్న కుటుంబం నుంచి వచ్చానని తెలిపింది. అటు చదువులో ఇటు స్పోర్ట్స్ లో టాప్ లో ఉన్నాను అని గుర్తు చేసుకుంది. హరియాణాలోని చిన్న గ్రామంలో తాను పుట్టినట్టు తెలిపింది. నాన్నకు బదిలీలు ఎక్కువ కావడంతో దేశమంతా తిరిగానని ఆమె పేర్కొన్నారు. తెలుగులో సమంత, కీర్తి సురేష్, అనుష్క అంటే అభిమానమని మీనాక్షి తెలిపారు. శేఖర్ కమ్ముల మూవీలో నటించాలని ఉందన్నారు.
20 సంవత్సరాల వయస్సులో నాన్న చనిపోయారని ఆ సమయంలో తాను డెంటిస్ట్ గా పని చేస్తున్నానని అన్నారు. ఆ సమయంలో డెంటల్ కోర్స్ చేస్తున్న తాను చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో అమ్మ చదువుకు బ్రేక్ ఇస్తే ఇవ్వు ఖాళీగా ఉండకని మిస్ ఇండియా పోటీలకు ట్రై చేయమని సూచించారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో భర్త చనిపోతే నన్ను మిస్ ఇండియా పోటీలకు పంపడంపై అమ్మపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయన్నారు. తాను ఆ పోటీలలో పాల్గొని మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నానని తెలిపింది.