క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. ఇక దీని బారిన చాలామంది నటిమణులు పడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి క్యాస్టింగ్ కౌచ్ అనేది తెరపైకి వచ్చింది. కాగా గోవా బ్యూటీ ఇలియానా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఛాన్స్ లు రావాలంటే ఖచ్చితంగా పడిపోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.
ముఖ్యంగా కొత్త హీరోయిన్లు ఎన్నో కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ వాళ్ళకి ఛాన్స్ లు కావాలంటే మాత్రం…నిర్మాతలతో దర్శకులతో పడుకోవాల్సిందే అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.