మాస్ మహారాజ రవితేజ, గోవా బ్యూటీ ఇలియాన .. కాంబినేషన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ మూవీల్లో కలిసి సందడి చేశారు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. వీరీ కాంబినేషన్ మాత్రం మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మరో మూవీలో వీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఈమూవీలో ఇలియాన కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇలియాన హీరోయిన్‌గా కాకుండా రెండు సీన్లు, ఒక స్పెషల్ సాంగ్‌లో మాత్రమే కనిపించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై సంప్రదింపులు పూర్తయ్యాయని, దాదాపుగా ఒకే చెప్పినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్లుగా మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ కథనాయికలుగా చేస్తున్నారు.