గోవా బీజేపీ శాసనసభ పక్షం నేడు పనాజీలో సమావేశం కానుంది. గోవా నూతన ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎన్నుకోనున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీని కూడా సమావేశంలో నిర్ణయించనున్నారు.
గోవా బీజేపీ అధ్యక్షుడు సదానందా తనవాడే ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ఎల్. మురుగన్ లు సమావేశంలో పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సీఎం రేసులో ముందున్నారు.
పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ప్రమోద్ సావంత్ తెలిపారు. తమ పార్టీకి 20 సీట్లు రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.