కరోనాకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గోవా రికార్డ్ సృష్టించింది. ప్రజలందరికీ మొదటి డోసు వ్యాక్సిన్ అందించిన రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఈ ఫీట్ సాధించగా.. గోవా రెండో స్థానంలో ఉంది.
I congratulate our Doctors, Nurses and Healthcare Workers for administering the first dose of #COVID19 vaccines to 100% eligible population in Goa. I thank the people of Goa for their support in making this drive a huge success. pic.twitter.com/fsuX7vWmDS
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) September 10, 2021
రాష్ట్ర ప్రజలందరికీ మొదటి డోసు టీకా పూర్తిచేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. అక్టోబర్ 31 నాటికి రెండో డోసును కూడా పూర్తి చేస్తామని చెప్పారాయన. గోవాలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది.
Well done Goa! Great effort, powered by a collective spirit and the prowess of our doctors as well as innovators. https://t.co/Kp7tvOwBj6
— Narendra Modi (@narendramodi) September 10, 2021
Advertisements
గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ స్పందించారు. ఇది ఎంతో సంతోషించే విషయమని కొనియాడారు. అందరూ కలిసి ఓ జట్టుగా ఈ విజయం సాధించారని చెప్పుకొచ్చారు ప్రధాని.
ఇక హిమాచల్ ప్రదేశ్ కూడా నవంబర్ 30ని టార్గెట్ గా పెట్టుకుంది. అప్పటివరకు అందరికీ రెండో డోసు టీకా వేయాలని చూస్తోంది.