గోవా అనగానే లిక్కర్ తో బీచుల్లో ఎంజాయ్ చేయొచ్చు అనే ఎక్కువ మంది అనుకుంటారు. యువత ఎక్కువగా వెళ్లేది కూడా అందుకే. అక్కడి సముద్ర అందాలకు తోడు మందేసి చిందేయటం అలవాటైపోయింది. కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో మందుబాబులు చేసిన పిచ్చి పనితో గోవా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
2019లోనే చేసిన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది గోవా టూరిజం బోర్డు. ఇక నుండి గోవా బీచుల్లో మద్యం సేవించిన వారికి 2వేల చొప్పున ఫైన్ వేయనున్నారు. ఒక వేళ గ్రూపులుగా మద్యం సేవించిన వారికి 10వేల జరిమానా వేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా…. మందుబాబులు ఫుల్ గా మద్యం సేవించి, ఖాళీ సీసాలను బీచ్ లోనే వదిలి వెళ్లిపోయారు. దాంతో అవి పర్యాటకులకు ఇబ్బందిగా మారటంతో ఈ నిర్ణయం తీసుకుంది.