అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు, వింతలు, ఆశ్చర్యకర విషయాలు మన కళ్ల ముందే జరుగుతున్న నమ్మలేనట్టుగా చూస్తాము. అదే, దేవుడి సన్నిధిలో ఏదైనా వింతగా అనిపిస్తే.. అది ఆయన మహత్యమే అని భక్తులు నమ్ముతారు. ఇలా ఎన్నో వింతలు విశేషాల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. తమిళనాడులో కూడా ఇలాంటి ఓ వింత ఘటనే చోటుచేసుకుంది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపడుతున్నారు.
తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలోని కలక్వాడ్ గ్రామంలో అరుల్మిగు అంగాలా పరమేశ్వరీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రోజు ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మేక రోజు ఆ గుడికి వెళ్లి.. సుమారు 10 నిమిషాల పాటు ఏకధాటిగా గంట మోగిస్తోంది.
రోజూ ఆలయానికి చేరుకుంటున్న మేక గంట నుంచి స్తంభానికి కట్టిన తాడును తన కొమ్ములతో ఆడిస్తూ మోగిస్తోంది. మేక చేస్తున్న పనిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.