మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.
హీరోయిన్ గానీ .. డ్యూయట్స్ గాని లేకుండా చిరంజీవి చేసిన ప్రయోగం ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత చాలా తక్కువ సమయంలోనే చిరంజీవికి ఇంత పెద్ద హిట్ పడటం పట్ల మెగా అభిమానులంతా ఖుషీ అవుతున్నారు. తొలివారం వసూళ్ల నెంబర్ రికార్డు స్థాయిలోనే ఉండొచ్చని అంటున్నారు.
చిరంజీవి .. సల్మాన్ .. నయనతార .. సత్యదేవ్ పాత్రలు ఈ సినిమాకి ప్రధానమైన పిల్లర్స్ గా నిలిచాయి. మోహన్ రాజా టేకింగ్ .. తెలుగు వెర్షన్ కోసం ఆయన చేసిన మార్పులు .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. ఇక ఇప్పుడు మెగా అభిమానులందరి దృష్టి ఆ తరువాత రానున్న ‘వాల్తేర్ వీరయ్య’ పైనే ఉంది