భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తోంది. ఇప్పటికే నీటిమట్టం 48.30 అడుగులకు పైనే చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. పడమర మెట్ల వద్దకు వరదనీరు చేరింది. అన్నదాన సత్రంతో పాటు, మెట్ల దగ్గర ఉన్న చాలా షాపులు మునిగిపోయాయి.
వరదనీరు అంతకంతకూ పోటెత్తుతుండడంతో అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. ఎవరైనా సాయం కోసం 08744- 241950, 08743-232444 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని.. అలాగే 9392919743 వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వొచ్చని సూచించారు.
భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.