గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరింది.అయితే రెండు రోజుల నుంచి ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతుంది.
భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 64 అడుగులకు చేరింది. ప్రస్తుతం 20.01 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద వరద 75అడుగులకు చేరుతుందని అధికారులు భావించారు.
అయితే వానలు తగ్గిపోవడంతో వరద కూడా ఆగిపోయింది. దీంతో వరద గోదావరి కాస్త శాంతించింది. కాగా భారీ వరదలతో భద్రాచలంలోని పలు కాలనీలు ఇప్పటికే ముంపులోనే ఉన్నాయి. సుభాష్ నగర్,కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ వరద నీటిలో మునిగిపోయాయి.
కరకట్ట బ్యాక్ వాటర్ రామాలయం ప్రాంతంలోకి వస్తున్నది.దీంతో రామాలయం వద్ద వరద పెరుగుతుండటంతో ఆలయ పడమర మెట్లుఅన్నదాన సత్రం నీట మునిగాయి. వరద విలయంలో చిక్కుకున్న భద్రాచలంలో వరద సహాయక చర్యలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఐదు రోజులుగా ఆలయ నగరిలో ఉండి దగ్గరుండి అధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.