పడవ మునగడానికి 5 నిమిషాల ముందు వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. ఆ మధుర స్మృతులను పదిలం చేసుకోవాలని సెల్ఫీలు దిగారు. ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది.
దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో బోటు ప్రమాదంలో ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదాన్ని ఊహించని వారంతా సరదాగా సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు అందులో ఉంది. బోటు ఒక్కసారిగా కుదుపునకు గురై మునిగిపోవడంతో ఆటపాటలతో సాగుతున్న వారి ఆనంద క్షణాలు అంతలోనే ఆవిరయ్యాయి.