సాధారణంగా వీకెండ్ కలెక్షన్ అంటే 3 రోజుల వసూళ్లు గురించి చెబుతారు. కానీ గాడ్ ఫాదర్ మాత్రం దసరా కానుకగా కాస్త ముందే రిలీజైంది. సో.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 5 రోజుల రన్ పూర్తి చేసుకుంది. కాబట్టి గాడ్ ఫాదర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ అంటే, టోటల్ 5 రోజుల వసూళ్లు చెప్పాల్సి ఉంటుంది.
విడుదలైన మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ సినిమా, రోజురోజుకు తన వసూళ్లు పెంచుకుంది. అలా విడుదలైన ఈ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం మార్కెట్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సినిమా ఇదొక్కటే. అది గాడ్ ఫాదర్ కు అతిపెద్ద ప్లస్.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా కీలకమైన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇంకా వసూళ్లు రావాలి. ఏపీ,నైజాంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెల్ వాల్యూ (హయ్యర్స్ తో కలిపి) 70 కోట్లు. ప్రస్తుత వసూళ్లతో కంపార్ చేసి చూస్తే, మూవీ దాదాపు 65శాతం బ్రేక్ ఈవెన్ అయినట్టు లెక్క.
రాబోయే శని, ఆదివారం వసూళ్లతో గాడ్ ఫాదర్ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి. (5 రోజుల వసూళ్లు)
నైజాం – 10.93 కోట్లు
సీడెడ్ – 8.31 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.93 కోట్లు
ఈస్ట్ – 3.25 కోట్లు
వెస్ట్ – 1.88 కోట్లు
గుంటూరు – 3.59 కోట్లు
నెల్లూరు – 1.76 కోట్లు
కృష్ణా – 2.31 కోట్లు