ఆచార్య అట్టర్ ఫ్లాప్ తో గాడ్ ఫాదర్ రిజల్ట్ పై చిరంజీవి చాలా టెన్షన్ పడ్డారు. అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో కూడా జోక్యం చేసుకున్నారు. రీజనబుల్ రేట్లకు సినిమాను అమ్మడంతో పాటు, కొన్ని రైట్స్ ను నిర్మాతలతో కలిసి తను కూడా అట్టిపెట్టుకున్నారు. మరోవైపు థియేటర్ల సంఖ్యను కూడా ఇబ్బడిముబ్బడిగా పెంచేయకుండా, లిమిటెడ్ గా సినిమాను రిలీజ్ చేశారు.
తెరవెనక చేసిన ఈ ఏర్పాట్లకు తోడు, తెరపై సినిమా కూడా ఆడియన్స్ కు నచ్చడంతో చిరంజీవి ఊపిరిపీల్చుకున్నారు. గాడ్ ఫాదర్ తో మరోసారి సక్సెస్ అందుకున్నారు. అటు హిందీలో కూడా ఈ సినిమాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ వీకెండ్ కోసం నార్త్ బెల్ట్ లో ఏకంగా 600 స్క్రీన్స్ పెంచుతున్నారు.
విడుదలైన ఈ 3 రోజుల్లో గాడ్ ఫాదర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ (రూ.44 కోట్ల గ్రాస్) వచ్చింది. మొదటి రోజుతో పోల్చుకుంటే, ఈ మూవీకి రోజురోజుకు ఆక్యుపెన్సీ పెరుగుతోంది. వీకెండ్ కూడా రావడంతో, ఈరోజు రేపు, ఈ సినిమాకు మంచి వసూళ్లు ఆశిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ సినిమాకు 3 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – 7.35 కోట్లు
సీడెడ్ – 6.27 కోట్లు
ఉత్తరాంద్ర – 3.16 కోట్లు
ఈస్ట్ – 2.53 కోట్లు
వెస్ట్ – 1.33 కోట్లు
గుంటూరు – 2.73 కోట్లు
నెల్లూరు – 1.16 కోట్లు
కృష్ణా – 1.58 కోట్లు