మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్… గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్‌ను కలుసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌కు పవన్ వెళ్లగా, భీమ్లా నాయక్ సెట్ కు మెగాస్టార్ చిరంజీవి వెళ్ళారు.
ఇదే విషయాన్ని చెబుతూ వీడియో షేర్ చేశారు రామ్ చరణ్. మొదట భీమ్లా సెట్స్ లో అడుగుపెట్టారు చిరు.ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర చిరుతో ఇంటరాక్ట్ అయ్యారు. చిరు అందులో ఖైదీ లుక్ లో కనిపించారు.
ఇక ఆ తరువాత పవన్ గాడ్ ఫాదర్ సెట్స్‌ను సందర్శించారు.అందులో పవన్ సింపుల్ గా పంచె కట్టుకుని కనిపించాడు. ఇకపోతే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చరణ్ ఈ వీడియో షేర్ చేశారు. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది.
#GODFATHER and #BHEEMLANAYAK visit each other’s film sets!#BheemlaNayakOn25thFeb @KChiruTweets @PawanKalyan pic.twitter.com/oGo9XuPuax
— Ram Charan (@AlwaysRamCharan) February 24, 2022