మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మరో భారీ అంచనాలు ఉన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ రిమేక్ సినిమాపై చిరంజీవి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన నేపధ్యంలో ఈ సినిమా విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ ను కూడా సినిమాలో తీసుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
దసరా కానుకగా విడుదల అవుతున్న సినిమాపై మెగా అభిమానులు సైతం ఆశగానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంచితే ఈ సినిమా మార్కెట్ బాగా చేసిందనే టాక్ వినపడుతుంది. గాడ్ ఫాదర్ నైజాం హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి అని అంటున్నారు. అలాగే సీడెడ్ హక్కులు 13.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ ఉంది. ఏపీ హక్కులు ఏకంగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ లో 7.5 కోట్ల రూపాయలకు, కర్ణాటక హిందీలలో ఈ సినిమా హక్కులు 6.50 కోట్లకు విక్రయించారు. ఇలా చూసుకుంటే 90 కోట్లకు పైగా మార్కెట్ చేసింది. మరి వసూళ్ళ పరంగా ఎలా ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. సల్మాన్ ఖాన్ పాత్రకు భారీగా ఖర్చు చేయడంతో సినిమా బడ్జెట్ పెరిగినట్టు తెలుస్తుంది.