Chiranjeevi Godfather Movie OTT: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద తొలుత కలెక్షన్లు భారీగా మొదలు పెట్టినా తర్వాత ఊహించని విధంగా డల్ అయింది. ఈమధ్యే ఓటీటీ రిలీజ్ కూడా అయింది. ఓటీటీలో తెలుగులో 3 స్థానంలో ట్రెండ్ అవ్వగా.. హిందీలో అయితే ఇండియా వైడ్ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఓసారి ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు చూద్దాం.
Megastar Chiranjeevi Godfather Movie OTT, Platform, OTT Rights
చిత్రం- గాడ్ ఫాదర్
థియేట్రికల్ రిలీజ్ డేట్- అక్టోబర్ 5, 2022
ఓటీటీ స్ట్రీమింగ్- నెట్ ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్- నవంబర్ 19, 2022
దర్శకుడు- మోహన్ రాజా
స్టారింగ్- మెగాస్టార్ చిరంజీవి, సత్యదేవ్, నయనతార మరియు ఇతరులు
ఈ సినిమా చాలా సన్నివేశాలను తిరుపతి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. రిలీజ్ కాకముందే ఈ చిత్రంలోని ఒక పాటను ఎవరో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
గాడ్ ఫాదర్ ఒరిజినల్ మూవీ లూసిఫర్. మలయాళంలో దీన్ని మోహన్ లాల్ తీశారు. మాలీవుడ్ లో ఎన్నో రికార్డులను కైవసం చేసుకుంది. అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల్లో ఇదొకటి. లూసిఫర్ కేవలం 4 రోజుల్లో 50 కోట్లు, 8 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది. తొలి 21 రోజుల్లో 150 కోట్లు రాబట్టింది. ఇక గాడ్ ఫాదర్ విషయానికొస్తే.. మొదటి వారం వరకు ఫర్వాలేదు కానీ తర్వాత కలెక్షన్స్ డల్ అయ్యాయి.
గాడ్ ఫాదర్ కలెక్షన్స్
ఏరియా వైజ్ గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ(నైజాం)లో రూ.12.40 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ.9.60కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 6.19 కోట్లు.. ఈస్ట్ గోదావరి- రూ.3.87 కోట్లు.. వెస్ట్ గోదావరి- రూ.2.45 కోట్లు గుంటూరు- రూ.4.15కోట్లు, కృష్ణా- రూ.3.26 కోట్లు.. నెల్లూరు రూ.2.21కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ.44.13కోట్లు షేర్(రూ. 73.00 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. అలాగే కర్ణాటక- రూ.4.75కోట్ల షేర్, హిందీ + రెస్టాఫ్ భారత్ రూ.5.25కోట్లు, ఓవర్సీస్ రూ.5.25 కోట్లు, టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ.59.38కోట్లు(108.70 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
గాడ్ ఫాదర్ హిట్టా లేదా ఫ్లాపా?
యావరేజ్.. మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి