చిరంజీవి హీరోగా నటించిన సినిమా గాడ్ ఫాదర్. థియేటర్లలో యావరేజ్ హిట్ అందుకున్న ఈ సినిమా, తాజాగా టీవీల్లోకి కూడా వచ్చేసింది. దాదాపు థియేటర్లలో దక్కిన రెస్పాన్సే బుల్లితెర వీక్షకుల నుంచి కూడా ఈ సినిమా అందుకుంది. ఇంకా చెప్పాలంటే, స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
గాడ్ ఫాదర్ సినిమాకు 7.7 టీఆర్పీ వచ్చింది. చిరంజీవి గత చిత్రాలు సైరా, ఆచార్య కంటే ఇది ఎక్కువ. చిరు హీరోగా నటించిన సైరా సినిమాకు అటుఇటుగా 5 రేటింగ్ రాగా, ఆచార్య సినిమాకు 6 వచ్చింది. ఇప్పుడు గాడ్ ఫాదర్ కు అంతకంటే మెరుగైన రేటింగ్ వచ్చింది.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది గాడ్ ఫాదర్ సినిమా. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్టుకు మార్పుచేర్పులు బాగానే చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీనికి కారణం, చిరంజీవ నుంచి ఆడియన్స్ ఆశించిన మాస్ మసాలాస్ లేకపోవడమే.