టూరిస్ట్ లు ఎక్కువగా వెళ్ళే దేశాల్లో దుబాయి ముందు వరుసలో ఉంటుంది. ఆ దేశంలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటమే కాకుండా గోల్డ్ వంటివి కాస్త తక్కువ ధరకు దొరకడంతో కొందరు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అసలు ఆ దేశానికి వెళ్ళే వాళ్ళ దగ్గర ఏం ఏం ఉండాలో ఒకసారి చూస్తే…
Also Read:రాబందులకు కుళ్ళిన మాంసం ఎలా అరుగుతుంది…? గ్యాస్ లీక్ ను రాబందులు ఎలా గుర్తిస్తాయి…?
కొంత ఆ దేశ కరెన్సీ క్యాష్ రూపంలో తీసుకెళ్లడం ఉత్తమం. దుబాయ్ చాలా డిజిటల్ అడాప్షన్ ఉన్నా సరే మెషిన్స్ ను నమ్మలేని పరిస్థితి. క్రెడిట్, డెబిట్ కార్డులకు ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ట్రాన్సక్షన్ లిమిట్లు చెక్ చేసుకోవాలి. వాక్సినేషన్ సర్టిఫికెట్ ఫిజికల్ కాపీ తీసుకెళ్ళాలి. మీ మొబైల్ కి ఇంటర్నేషనల్ రోమింగ్ ఆక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడ రవాణా చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుబాయ్ నగరం లో ప్రయాణించేటప్పుడు గవర్నమెంట్ టాక్సీలను మాత్రమే నమ్ముకోవాలి.
స్టార్టింగ్ ప్రైస్ 5 AED నుంచి, రష్ గా ఉన్నప్పుడు అయితే 12 AED వరకు ఉంటాయి. కార్డులు కూడా తీసుకుంటారు. టూరిస్ట్ దగ్గర తీసుకునే వాట్ టాక్స్ (5%) ను వెనక్కి ఇచ్చేస్తారు. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆ షాప్ వాళ్ళని అడగాలి. పాస్పోర్ట్ కాపీ తీసుకుని బార్ కోడ్ మీ బిల్ మీద ఇస్తారు. ఒక బార్ కోడ్ మీ బిల్ పైన ఇస్తారు. అవి చూపిస్తే విమానాశ్రయంలో ఆ టాక్స్ మనకు ఇచ్చేస్తారు. వాట్ ఇవ్వాలి అంటే ఆ దేశ కరెన్సీ లో కనీసం 250 మనం ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. గోల్డ్ కొనుగోలు చేసినా సరే పన్ను వెనక్కు ఇస్తారు.
Also Read:వీరుల వంశం..అందుకే ముర్ముకు పట్టం !