మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆరేళ్ల తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా పెరిగిపోయాయి. పల్లాడియం ధరలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. 2020 ఆరంభంలోనే బంగారం ధరలు విపరీతంగా పెరిగి అమ్మకం దారులకు ఏడాది అమ్మకాలతో వచ్చే లాభాలు ఇప్పుడే వచ్చాయి.
ఇరాక్ లో ఇరాన్ సైనికాధికారి ఖాసీం సులేమాని ని శుక్రవారం అమెరికా డ్రోన్ దాడితో హతమార్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాక్ లో అమెరికా సైనిక క్యాంపులు, ఎంబసీపై దాడులు జరిగాయి. దీంతో అమెరికా కూడా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ పౌరులపై, ఆస్తులపై దాడులు చేస్తే ఇరాన్ లోని 52 రెండు కీలక ప్రాంతాలను సర్వ నాశనం చేస్తామని హెచ్చరించింది. దీంతో పశ్చిమాషియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరిగిపోయాయి.
2013లో ఒక ఔన్స్ బంగారం ధర 1,569.90 డాలర్లుండగా..ప్రస్తుతం 2.3 శాతానికి పెరిగి 1,588.13 కు చేరింది.ఇండియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.1800 పెరిగింది.