మంగళవారం బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. పది గ్రాముల బంగారం దాదాపు 400 రూపాయల వరకూ తగ్గింది. మరో వైపు వెండి ధర మాత్రం నిలకడగా ఉంది.
22 క్యారెట్లు బంగారం పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 320 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,520 రూపాయలుగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 210 రూపాయల తగ్గి 43,175 రూపాయలు నమోదు చేసింది.
విజయవాడ, విశాఖపట్నం లలో బంగారం ధరలు, 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం ధర కంటే 320 రూపాయల తగ్గి 39,520 రూపాయలుగా పలుకుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 210 రూపాయల తగ్గి 43,175 రూపాయలు పలుకుతుంది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 420 రూపాయల తగ్గుదలతో 43,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల తగ్గుదలతో 41,020 రూపాయలకు చేరుకుంది.