హెచ్చు తగ్గులు మధ్య కొనసాగుతున్న బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధర కూడా స్పల్పంగా దిగ్గడంతో.. కొనుగోలు చేయడానికి అతివలు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో ఈ బంగారం 10 గ్రాముల రేటు రూ.47,950కి దిగొచ్చింది. అంతేకాకుండా నగరంలో ఒక్క గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,795గా నడుస్తోంది. కిలో వెండి ధర రూ.68,321 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌తో పాటు శాఖపట్టణం, విజయవాడ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950కి తగ్గింది. 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం రూ.52,310 కు వద్ద సరిపెట్టుకుంది.
చెన్నైలో 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.48,200కి దిగిరాగా.. అహ్మదాబాద్ లో రూ.48,030, జైపూర్, లక్నో, చండీగఢ్ ల్లో రూ.48,100, పాట్నాలో రూ.48,000కి తగ్గింది. అదేవిధంగా దేశంలో 24 క్యారట్ల బంగారం ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. చెన్నైలో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ.52,580కి తగ్గగా.. అహ్మదాబాద్‌లో రూ.52,350, జైపూర్, లక్నో, చండీగఢ్‌ల్లో రూ.52,450 కాగా.. పాట్నాలో రూ.52,400గా వద్ద స్థిరపడింది.
గడిచిన 10 రోజుల్లో 3 సార్లు పెరిగిన పసిడి ధరలు.. నాలుగు సార్లు తగ్గాయి. బంగారంతో పాటు వెండి ధరలు సైతం దిగొచ్చాయి. హైదరాబాద్ లో కిలో వెండి రూ.71,300కి తగ్గింది. నిన్నటితో పోలిస్తే రూ.400 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి రేటు రూ.713కి చేరింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగళూరు, కేరళలో కిలో వెండి రూ.71,300కి తగ్గింది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, పూణె, జైపూర్, లక్నోల్లో రూ.66,800కి పడిపోయింది.