బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకోవాలనుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారానికి అధిక డిమాండ్ పెరిగింది. దీంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
తాజాగా మరోసారి బంగారం ధరలు అధికంగా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్టైంది. తాజాగా పెరిగిన బంగారం ధరలతో హైదరాబాద్ మార్కెట్ లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.53,250 వరకు పలుకుతోంది.
బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే ఒక్కసారే భారీగా పెరగింది. ప్రస్తుతం వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర రూ.65,623 గా నమోదు అవుతోంది. గడిచిన 24 గంటల్లో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.700కు పైగా పెరగగా.. కిలో వెండి రూ.1200కిపైగా ఎగబాకింది.
దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 5305 పాయింట్లు పెరిగి.. 56,204 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి.. 16,489 వద్ద కొనసాగుతోంది.