దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు.. శనివారం అమాంతం పెరిగాయి. ఆదివారం మళ్లీ స్వల్పంగా దిగొచ్చాయి. అలాగే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1888.44 డాలర్లు పలికింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 23.21 డాలర్లకు చేరుకుంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 ఉంది. నిన్నటితో పోల్చితే రూ.150 తగ్గింది. 24 క్యారెట్ల ధర రూ. 52.800 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,400 ఉండగా 24 క్యారెంట్ల 10 గ్రాముల ధర రూ. 52,800గా ఉంది. అలాగే, కిలో వెండి రూ.539 కి పైగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,731గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48.400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52.800 ఉంది. ముంబై, కేరళ, విశాఖపట్టణం, బెంగళూరుల్లో బంగారం ధరలు ఒకే రకంగా ఉన్నాయి. 22 క్యారెంట్ల 10 గ్రాముల ధరం రూ. 48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,800 వద్దకు చేరింది.
ఇక, క్రిప్టో కరెన్సీల్లో బిట్‌కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బిట్‌కాయిన్ రూ.29,16,379.49 ఉండగా.. ఇథీరియం రూ.2,13,387.52, డోజ్కాయిన్ రూ.10.13, టెథర్ రూ.76.53, బీఎన్బీ కాయిన్ రూ.29,425.46 లు ఉంది.