బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. దాదాపు రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోయాయి. బంగారం ధర వెంటే వెండి ధర కూడా డౌన్ ఫాల్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అమావాస్య కారణంగా మార్కెట్‌కు సెలవు.
ఈరోజు బంగారం ధరలను చూస్తే… హైదరాబాద్ మార్కెట్‌లో 10గ్రాముల బంగారం ధర 38900గా నమోదైంది. బుధ,గురువారాల్లో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యంగా దేశీయంగా మార్కెట్ కొనుగోల్లు ఎక్కువే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త క్షీణించటంతో పాటు, రూపాయి మారకం విలువ కాస్త పెరగటం ఈ బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమయ్యాయని తెలుస్తోంది.
అసలే పెండ్లిల సీజన్ కావటంతో బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. 50వేల వరకు బంగారం ధర చేరుతుందని ముందుగా మార్కెట్ వర్గాలు విశ్లేషించినప్పటికీ అప్పటి జోరును… బంగారం కొనసాగించలేక పోయింది.
ALSO READ: