గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంపై బంగారం, క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లపై స్పష్టంగా కనపడింది. పసిడి ఆల్‌టైం రికార్డ్ పెరుగుదలను నమోదు చేసింది. 42వేల గరిష్ట మార్క్‌ను దాటడంతో… 50వేల వరుకు పరుగులు పెడుతుందని అంతా అంచనా వేశారు. పైగా ఇరాన్-అమెరికా కవ్వింపు చర్యలతో మార్కెట్ నిపుణులు కూడా బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అంచనా వేశారు.
కానీ యుద్ధమేఘాలు వెనక్కి తగట్టంతో… పసిడి ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 530రూపాలు దిగొచ్చింది. దీంతో పసిడి ధర 38,430కు పడిపోగా… 24 క్యారెట్ల బంగారం ధర 500కు పైగా పడిపోయి 41,800రూపాయలుగా నమోదైంది. అయితే పరిస్థితులు ఇలాగే ఉంటే బంగారం ధర 40వేల వరుకు దిగి వచ్చే అవకాశం ఉంటుందని తాజాగా బంగారం వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Advertisements
ముత్తూట్ ఫైనాన్స్ ఎం.డి పై దాడి