బంగారం ధర దిగి వస్తోంది. సామాన్యునికి అందనంత ఎత్తుకు పెరిగిపోయిన బంగారం ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. మరో వారంలో మరింత క్షీణిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై వేటు
40వేల మార్క్ దాటిన బంగారం ధర… 50వేలకు చేరుకుంటుందని అంతా భావించారు. దాంతో బంగారం కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. అయితే… అమెరికా-చైనా ట్రేడ్ వార్ కాస్త వెనుకడుగు పడుతుండటం, అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తుండటం, కొంతమేర రూపాయి మారకం విలువ కూడా బాగుపడుతుండటంతో… దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు 10గ్రాముల బంగారం ధర 38800గా ట్రేడ్ అవుతోంది. రాబోయే పది రోజుల్లో 37000మార్క్‌కు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.