బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్ విలువ పెరగటంతో… గత ఐదారు నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దాంతో దేశీయంగా బంగారం ధరలు 40వేలకు పై చిలుకు వెళ్లింది. 50వేల వరకు చేరుతుంది అని మార్కెట్ అంతా అంచనా వేసింది.
అయితే, అంతర్జాతీయంగా మార్కెట్ల్‌లో రేటు పడిపోతుండటంతో క్రమంగా బంగారం ధరలు కూడా దిగి వస్తున్నాయి. దాంతో గత 45 రోజుల్లో ఈరోజే అత్యల్పంగా బంగారం ధరలు నమోదయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 39200రూపాయాలుగా నమోదయ్యాయి. అసలే పెళ్ళిళ్ల సీజన్ కూడా కావటంతో… ఇక బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.