కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. ఓ దశలో అరవై వేల మైలురాయిని చేరుకునేందుకు పసిడి పరుగులు పెట్టినా, క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొన్ని రోజులుగా 51వేల వద్ద స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం బుధవారం ఒక్కసారిగా పెరిగింది.
బుధవారం గోల్డ్ రేటు ఒక్కసారిగా 450రూపాయలకు పైగా పెరుగుదల నమోదు చేసి 52వేలు దాటేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24క్యారెట్ల మెలిమి 10గ్రాముల బంగారం 52,250 ధర పలుకుతుంది. రాబోయే రోజుల్లో మరికాస్త పెరగొచ్చని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ లు మొదలు కాబోతుండటం, డాలర్ కాస్త బలహీన పడటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ విధానపరమైన భేటీ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. బుధవారం వచ్చే సమావేశం నిర్ణయాన్ని బట్టి బంగారం ఫ్యూచర్ రేట్లు ఆధారపడనున్నాయి.