
వరుసగా మూడో రోజు బంగారం ధర భారీగా పెరిగింది. ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకులతో పసిడి రికార్డు ధరకు చేరుకుంది. బుధవారం బంగారం ధర ఏకంగా 460 రూపాయలు పెరిగి 43007 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర 42,860రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 520రూపాయల పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం కూడా 40వేల మార్క్‌ను దాటేసింది.
ఇక వెండి కూడా పసిడి వెనుకాలే పరుగెడుతోంది. కిలో వెండి ధర 49340రూపాయలకు చేరుకుంది.
అయితే, ఈ రోజు బంగారం ధరలు మరింత పైకి చేరుకోవటంలో రూపాయి బలహీన పడటం కూడా కారణంగా కనపడుతోంది. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 71.729రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారం ధరలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.