పసిడి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రతి రోజు పెరిగిపోతూనే ఉన్న బంగారం ధరలు… తాజాగా ఆల్ టైం హైకి చేరాయి. ఒక్కరోజులోనే దాదాపు వెయ్యి రూపాయలు పెరిగి, అరవై వేలకు చేరువయ్యింది. దీంతో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,140కి చేరింది.
కేవలం ఒక్క నెల రోజుల్లోనే బంగారం ధర దాదాపు 8వేలకు పెరిగింది. జులై 8న 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 50,655 ఉండగా…. ఆగస్టు 7న అదే 10గ్రాముల బంగారం ధర 58,140కి చేరింది.
24క్యారెట్ల బంగారం రూట్లోనే 22క్యారెట్ల బంగారం, వెండి ధరలు దూసుకపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 54,200కు చేరగా… కిలో వెండి 76,510కి చేరింది. ఒక్క రోజే కిలో వెండి ధర దాదాపు 3వేలు పెరగటం గమనార్హం.
ఈ రికార్డు స్థాయి ధరలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని, బంగారంపై పెట్టుబడికి మదుపర్లు మొగ్గుచూపటమే పసిడి ధరలు పెరిగేందుకు ముఖ్య కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.