అక్రమ స్మగ్లింగ్ కు పాల్పడ్డ కొందరు అధికారుల కండ్లు కప్పి తప్పించుకునేందకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. బార్డర్ల నుండి గోల్డ్ ను తరిలించేందుకు స్మగ్లర్లు చేయని తప్పులేదు. వెతకని మార్గాలు లేవు.
తాజాగా మాల్దా నుంచి సిలిగురికి బస్సులో వెళుతున్న వ్యక్తిని ఉత్తర బెంగాల్ యూనివర్సిటీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీగా బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
కాగా.. సుమారు రూ 1.7 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను.. నిందితుడు తన అండర్‌వేర్‌లో దాచి అక్రమంగా తరలిస్తున్నాడని అందిన విశ్వసనీయ సమాచారంతో.. అతను ప్రయాణిస్తున్న బస్సును ఆపిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. అతని వద్ద ఉన్న బంగారు బిస్కెట్ల ను స్వాదీనం చేసుకున్నట్టు ప్రభుత్వ న్యాయవాది రతన్ బానిక్ వెల్లడించారు.
ఒక్కో బంగారు బిస్కెట్ 16 గ్రాముల బరువుందని తెలిపారు. వాటి మార్కెట్ విలువ రూ. 1,71,87,640 ఉంటుందని వివరించారు. అరెస్ట్ చేసిన తర్వాత నిందితున్ని సిలిగురి కోర్టులో హాజరు పరిచినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.