హైదరాబాద్ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ చూడాలనే ఆసక్తి ఉన్నవాళ్లే ఆ ముఠాకు స్మగుల్ గూడ్స్. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందా.. ఓ యువకుడి ద్వారా బట్టబయలైంది. మొత్తం స్మగ్లింగ్ వ్యవహారం.. ఓ ఫేమస్ సినిమాను తలపిస్తోంది.
నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తూ అక్రమ సంపాదన చేస్తోంది. ఎవరైనా పర్యటన నిమిత్తం దుబాయ్‌కు వెళితే వారిని గుర్తించే ఈ ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పర్యటన ఖర్చులతో పాటు మరింత డబ్బును అదనంగా ఇస్తామని నమ్మబలుకుతుంది. ఇదే క్రమంలో పాతబస్తీకి చెందిన సహబాజ్(21) ద్వారా పరిచయం అయిన ఈ ముఠా షహబాజ్‌తో పాటు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆయాజ్(22), అశోక్‌కాలనీకి చెందిన పహద్(23)లను గత 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపించారు.
అక్కడ ఈ ముఠాకు చెందిన సభ్యులు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని కాళ్లకు చుట్టుకుని రావలసి ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆయాజ్ బంగారాన్ని తీసుకుని హైదరాబాద్‌కు ముందుగానే చేరుకున్నాడు. షహబాజ్, పహద్‌లు శుక్రవారం నగరానికి రావాల్సి ఉంది. అయితే పహద్ దుబాయ్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కకుండా అదృశ్యయమయ్యాడు. బంగారంతో పాటు అదృశ్యమైన పహద్ కోసం నగరంతో పాటు దుబాయ్‌లోని స్మగ్లర్లు గాలింపు చేపట్టి వెదుకుతున్నారు.
పహద్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాలంటూ నగరానికి వచ్చిన అయాజ్, షహబాజ్‌లతో పాటు పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, వారి దగ్గర బంధువు ఆసిమ్‌లను ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేవారు. అలాగే దుబాయ్‌లో ఉండే పహద్ దగ్గరి బంధువు ఆకిబ్‌ను కూడా దుబాయిలో కిడ్నాప్ చేశారు. నగరంలో కిడ్నాప్ చేసిన నలుగురిలో షహబాజ్, ఆయాజ్, ఆసిమ్‌లను విడిచిపెట్టారు.