ఏలూరుజిల్లా ఏడువాడలపాలెం గ్రామానికి చెందిన దంపతుల్ని అద్రుష్టం వరించింది. వారికి చెందిన పామ్ ఆయిల్ తోటలోని పైపులైన్ ఏర్పాటు నిమిత్తం పొలాన్ని తవ్వుతుండగా పురాతన కాలం నాటి ఓమట్టిపిడత కనిపించింది.
లక్కు ఎవర్ని ఎలా వరిస్తుందో ఎవరికి తెలుసు.! పిడతని పగులగొట్టి చూసేసరికి ఇంకేముంది..!మట్టిపిడతలో మహాభాగ్యం..బైటపడింది. ఎవరికి కష్టమో ! సదరు దంపుతుల అద్రుష్టమో..! పిడతలో ఒకటీరెండూ కాదు ఏకంగా 18 బంగారు నాణేలు లభ్యం అయ్యాయి. గతనెల29న ఈఘటన గ్రామంల్లో సంచలనం స్రుష్టించింది.
తోట యజమానులైన మానుకొండ తేజస్వి ,ఆమె భర్త సత్యన్నారాయణ మండల తహసీల్దార్ పి.నాగమణికి సమాచారం అందించారు. నాణేలని పరిశీలించిన నాగమణి ఒక్కోనాణెం దాదాపు 8గ్రాములు ఉండవచ్చని అంచనా వేసారు.కాగా ఇవి రెండు శతాబ్ధాల క్రితానివని అభిప్రాయపడ్డారు. దొరక్క దొరక్క దొరికిన సంపద.! 18 నాణేలు కాకపోయినా పైగా ఉన్న ఎనిమిది నాణేలిచ్చినా సత్యన్నారాయణ దంపతుల పంటపండినట్టే.!ఎన్ని పామాయిల్ గింజల నూనెతీస్తే ఇనప్పెట్టి నిండుతుంది.ఇలాంటి మట్టిపిడతొకటి తమపొలంలో కూడా పగిలితే చాలుకదా ! అనుకుంటున్నారు గ్రామప్రజలు.