ముంబై : గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముంబై ఒక గ్రేట్ వండర్‌గా కనిపిస్తుంది. అక్కడ బొజ్జ గణపయ్యను కొలిచే విషయంలో మనీ అసలు మేటరే కాదు. పోటాపోటీగా వెరైటీగా ఉత్సవాలు చేస్తారు. ముంబైలో 70 కిలోల బంగారం 350 కిలోల వెండితో తయారుచేసిన రూ. 264 కోట్ల విలువగల గణపతి ఇప్పుడు ఒక పెధ్ద విశేషం. అక్కడి జనం ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. గోల్డెన్ గణేష్ ముంబై చూసిపోడానికి వచ్చే యాత్రికులను, భక్త జనులను ఎంతో ఆకట్టుకుంటున్నాడు.